ములుగు: అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పారదర్శకంగా చేపడుతున్నట్లు కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన బుధవారం ఆర్డీఓ కృష్ణవేణి, ఎస్‌డీసీ ప్రతాప్, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీడబ్ల్యూఓ ప్రేమలత ఫైవ్‌మెన్ కమిటీ ఆధ్వర్యంలో అంగన్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అభ్యర్థుల అర్హతలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా ఎంపిక చేస్తున్నామని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో దళారుల ప్రమేయానికి తావులేదని స్పష్టం చేశారు. జిల్లాలోని తాడ్వాయి, వెంకటాపురం ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీగా ఉన్న 31 అంగన్‌న్‌వాడీ టీచర్, 104 అంగన్‌వాడీ హెల్పర్ పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తొలిరోజు తాడ్వాయి ప్రాజెక్టు పరిధిలో గల అంగనన్‌వాడీ టీచర్ పోస్టుల అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు వెల్లడించారు. నేడు వెంకటాపురం ప్రాజెక్టు, రేపు తాడ్వాయి, 7వ తేదీన వెంకటాపురం ప్రాజెక్టు అంగన్‌న్‌వాడీ టీచర్, హెల్పర్ పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించనట్లు వివరించారు. ఆయా తేదీల్లో ఉదయం 10.30 గంటల నుంచి కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు.
కలెక్టర్ భోర్ఖడే హేమంత్ సహదేవరావు


