జిల్లాలో పడిపోతున్న భూగర్బ జలాల వివరాలు (మీటర్లలో)
ఏటూరునాగారం: ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో భూగర్భ జలాలు అడుగటడంతో పాటు పంటలు పలుచోట్ల ఎండిపోతున్నాయి. దీంతో పలువురు రైతులు కొత్త బోర్లు వేయించడంతో పాటు మరికొందరు వేరే బోర్ల నుంచి పైపులు చాచి పంటలకు నీరు పారించుకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. మరికొందరు నీటి వసతి లేక అలాగే వదిలేయగా పశువులు మేస్తున్న దుస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గోవిందరావుపేట, ఏటూరునాగారం, వెంకటాపురం(కె), మంగపేట మండలాలను ప్రభుత్వం కరువు మండలాలుగా గుర్తించింది. ఈ నాలుగు మండలాల్లోని 73 గ్రామ పంచాయతీల్లో నెలకొన్న కరువు పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్టు.
లోటు వర్షపాతంతో ఇబ్బందులు
మంగపేట మండల పరిధిలో జూన్ నుంచి అక్టోబర్ 23 వరకు 1237.7 మిల్లీ మీటర్ల వర్ష పాతం పడాల్సి ఉండగా 1019.7 మాత్రమే కురిసి లోటు వర్షపాతం నమోదైందని అధికారులు చెబుతున్నారు. దీంతో రెండు మీటర్ల మేర భూగర్భ జలాలు పడిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మండలంలో 21,700 ఎకరాల్లో వరి పంట సాగుచేసిన రైతులు పంటలను కాపాడుకునేందుకు అనేక ఇబ్బందులు పడ్డారు. అష్టకష్టాలు పడి పంటలను కాపాడుకున్నారు. అలాగే 3500 ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు. వరి పంట 25శాతం కోత దశకు చేరుకోగా 70శాతం కంకి దశలో ఉంది.
వర్షాధార పంటలపై తీవ్ర ప్రభావం
ఏటూరునాగారం మండల పరిధిలోని 12 గ్రామ పంచాయతీలు ఉండగా మొత్తంగా 43 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు సరిగా కురవకపోవడంతో వర్షాధార పంటలు ఎండిపోతున్నాయి. ఎండిపోతున్న పంటలను రక్షించుకునేందుకు పలువురు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వాగుల నుంచి నీటిని పారించేందుకు మోటార్లు కొనుగోలు చేసి అమర్చి నీటిని పారిస్తున్నారు. దీంతో రైతులకు ఈ మోటార్ల కొనుగోలు ఖర్చు సైతం అదనపు భారంగా మారుతుంది.
సెప్టెంబర్
ఆగస్టు
జిల్లాలో నాలుగు మండలాలు
కరువు ప్రాంతాలుగా ప్రకటన
లోటు వర్షపాతంతో
రైతులకు తప్పని తిప్పలు
అడుగంటిన భూగర్భజలాలు..
ఎండుతున్న పంటలు
5.72 4.53
ఏటూరునాగారం
గోవిందరావుపేట
కన్నాయిగూడెం
మంగపేట
ములుగు
ఎస్‌ఎస్‌తాడ్వాయి
వెంకటాపురం(ఎం)
వెంకటాపురం(కె)
వాజేడు
5.72 4.53
5.63 4.65
6.68 5.74
9.37 8.98
4.61 4.44
1.82 1.74
4.36 3.54
7.95 7.59
బోరు నుంచి నీళ్లు పారించి పంటను రక్షించుకున్నాను...
5 ఎకరాల భూమిలో వరి పంటను సాగు చేశా. వర్షాలు సమృద్ధిగా కురిస్తే పంట బాగా పండేది. ఈ సారి వర్షాలు పడకపోవడంతో దూరంలో ఉన్న బోరు నుంచి 20 పైపులు అద్దెకు తీసుకొచ్చుకున్నాను. బోరుకు దూరంగా పొలం ఉండడంతో ఎన్నో ఇబ్బందులు పడి నీటిని పారించుకున్నాను.
– కొండగొర్ల ముత్తయ్య, రైతు, ఏటూరునాగారం


