రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థుల ఎంపిక

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

ఏటూరూనాగారం: మండల పరిధిలోని రామన్నగూడెం పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్రస్థాయి పోక్‌ డాన్స్‌ పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల హెచ్‌ఎం మల్లయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గోవిందరావు పేట జిల్లా పరిషత్‌ పాఠశాలలో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి పోక్‌డ్యాన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన హర్షవర్ధన్‌, ఉమ మహేశ్వర్‌, రిషి, దినేష్‌ వరుణ్‌, భార్గవ్‌, అనిల్‌ కార్తీక్‌లు ప్రధమ బహుమతి గెలుచుకున్నారని వివరించారు. దీంతో వీరు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై య్యారని వెల్లడించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఉపాధ్యాయులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement