దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

దోమల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి

Oct 29 2026 1:18 AM | Updated on Oct 29 2026 1:18 AM

ములుగు రూరల్‌: మలేరియా, డెంగీ వ్యాధుల గుర్తింపుపై నిఘా పెంచడంతో పాటు దోమల నియంత్రణకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు వైద్యసిబ్బందికి సూచించారు. ఈ మేరకు ఆయన జిల్లా కేంద్రంలో వ్యాధుల నియంత్రణపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కీటక జనిత వ్యాధుల నియంత్రణలో ఆరోగ్య కార్యకర్తలు, ల్యాబ్‌ టెక్నీషియన్ల పాత్ర కీలకమన్నారు. ఆరోగ్య కార్యకర్తలు గ్రామాల్లో తిరుగుతూ మలేరియా, డెంగీ వ్యాధులను గుర్తించాలన్నారు. జ్వర పీడితుల నుంచి రక్త నమూనాలను సేకరించాలని సూచించారు. 2030 నాటికి టీబీని అంతం చేయాలనే లక్ష్యంతో ప్రతిఒక్కరూ పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ సుధీర్‌, వైద్యాధికారులు రవితేజ, శ్రీకాంత్‌, రంజిత్‌, మాస్‌ మీడియా అధికారి సంపత్‌, డీపీఓ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement