మిల్లర్ల మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం!

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

ప్రభుత్వ బియ్యాన్ని పక్కదారి పట్టించిన ఘనులు

ధాన్యం తీసుకున్నారు.. బియ్యం ఏది?

ములుగు: ప్రభుత్వ ధాన్యాన్ని మర ఆడించి బియ్యంగా మార్చి తిరిగి ప్రభుత్వానికి అప్పగించాల్సిన బియ్యాన్ని పలువురు రైస్‌ మిల్లర్లు పక్కదారి పట్టించి సొమ్ముచేసుకుంటున్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థకు చేరాల్సిన బియ్యం మిల్లర్ల వద్దే మాయమవుతుంది. 2025 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి జిల్లాలో భారీగా కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌(సీఎంఆర్‌) బకాయిలు పేరుకుపోవడం ఈ ప్రశ్నలకు తావిస్తోంది. ఇప్పటి వరకు ఇంకా 25 వేల మెట్రిక్‌ టన్నుల బియ్యం మిల్లర్లు ప్రభుత్వానికి బకాయి ఉండటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. సెప్టెంబర్‌ 30తో ప్రభుత్వానికి చెల్లించాల్సిన బియ్యం గడువు ముగిసినా మిల్లర్ల నుంచి బియ్యాన్ని రికవరీ చేయడంలో అధికారులు నిర్లక్ష్యం వహించడంతో పాటు మళ్లీ ఈ నెల 31వ తేదీ వరకు గడువును ఇవ్వడంలో ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

25 వేల మెట్రిక్‌టన్నులకు పైగా బకాయి..

ప్రభుత్వం కేటాయించిన ధాన్యానికి సంబంధించి నిర్ణీత పరిమాణంలో బియ్యాన్ని తిరిగి అప్పగించడం మిల్లర్ల బాధ్యత. ఈ క్రమంలో జిల్లాలో 2025–26 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 25,148.059 మెట్రిక్‌ టన్నుల బియ్యం ప్రభుత్వానికి బకాయి ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. బకాయి బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించేందుకు అధికారులు రైస్‌మిల్లర్లకు ఈ నెల 31వ తేదీ వరకు గడువు ఇచ్చారు. ఈ గడువులోగా మిల్లర్లు సీఎంఆర్‌ బకాయిలను పూర్తిగా చెల్లిస్తారా అనేది సందేహాంగానే మారింది. గడువు దాటిన తర్వాత అధికారులు చర్యలు తీసుకుంటారా.. మళ్లీ గడువు పెంచి చేతులు దులుపుకుంటారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బకాయిల వసూళ్లలో అధికారులు కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రభుత్వానికి అందాల్సిన బియ్యం సకాలంలో రాదనే చర్చ జిల్లాలో జోరుగా కొనసాగుతోంది.

రబీ ధాన్యం భద్రమేనా?

2025–26లో జిల్లాలోని 43 రైస్‌ మిల్లులకు 1,11,766.160 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని జిల్లా పౌరసరఫరాల శాఖ అప్పగించింది. 34 రారైస్‌ మిల్లులకు 33,142.560 మెట్రిక్‌ టన్నుల ధాన్యం, 9 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు 78,623.600 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కేటాయించింది. ఈ మేరకు ప్రభుత్వానికి మిల్లర్లు 75,669.563 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని అందించాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌లోనే అప్పగించిన ధాన్యానికి పూర్తిస్థాయిలో బియ్యం ప్రభుత్వానికి అందించని మిల్లర్లు.. రబీలో తీసుకున్న ధాన్యానికి బియ్యాన్ని సకాలంలో సరఫరా చేస్తారా అనేది సందేహాంగా మారింది. అసలు రబీకి సంబంధించిన ఽప్రభుత్వ ధాన్యం రైస్‌మిల్లర్ల వద్ద పూర్తిస్థాయిలో ఉందా అనేది ప్రశ్నార్థకంగానే ఉంది.

సెప్టెంబర్‌ 30తో ముగిసిన గడువు

40 మిల్లులకు 1.40 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేటాయింపు

ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం 94,405 మెట్రిక్‌ టన్నులు

ఇప్పటి వరకు సరఫరా చేసింది 69,256 మెట్రిక్‌ టన్నులే..

మళ్లీ ఈ నెల 31 వరకు గడువు

కోరిన మిల్లర్లు

2025–26 ఖరీఫ్‌ సీజన్‌లో జిల్లాలోని 40 రైస్‌ మిల్లులకు 1,40,903.040 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని పౌరసరఫరాల శాఖ కేటాయించింది. ఈ ధాన్యాన్ని మిల్లింగ్‌ చేసి ప్రభుత్వానికి 94,405.037 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మిల్లర్లు అప్పగించాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు 69,256.978 మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని మాత్రమే మిల్లర్లు సరఫరా చేశారు. మిగిలిన 25,148.059 మెట్రిక్‌ టన్నుల బియ్యం ఇంకా ప్రభుత్వానికి చేరాల్సి ఉంది. గడువు ముగిసినా భారీ మొత్తంలో మిల్లర్లు బియ్యం బకాయి ఉండటంతో సీఎంఆర్‌ లక్ష్యం నెరవేరని పరిస్థితి నెలకొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement