అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం | - | Sakshi
Sakshi News home page

అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం

Oct 28 2026 1:06 AM | Updated on Oct 28 2026 1:06 AM

ములుగు రూరల్‌: పోలీస్‌ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌కేకన్‌ అన్నారు. పోలీస్‌ అమరవీరుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని మంగళవారం జిల్లా కేంద్రంలో సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్‌ అమర వీరుల నిస్వార్ధ సేవలు, ధైర్య సాహసాలు ప్రజల రక్షణకు వారు చేసిన త్యాగాలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు డీఎస్పీ సదానందం, ములుగు డీఎస్పీ రవీందర్‌, సీఐలు సురేశ్‌కుమార్‌, రిజర్వుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ స్వామి, ఎంటీవో వెంకటనారాయణ, వెల్ఫేర్‌, హోంగార్డు విభాగం అధికారులతో పాటు ఎస్సైలు కృష్ణప్రసాద్‌, వెంకటేశ్వర్లు, తాజొద్దీన్‌, కమలాకర్‌, జగదీశ్‌, సాయికృష్ణ అవినాష్‌ తదితరులు పాల్గొన్నారు.

రామప్పలో జర్మనీ దేశస్తుడు

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని చారిత్రక రామప్ప దేవాలయాన్ని మంగళవారం జర్మనీ దేశానికి చెందిన పాబియన్‌ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌ తీర్థ ప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. ఈ సందర్భంగా జర్మనీ దేశస్తుడు పాబియన్‌ మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, చరిత్ర అంటే ఎంతో ఇష్టమన్నారు. కాకతీయుల కట్టడాలైన రామప్ప, వేయిస్తంభాల గుడిలోని శిల్పకళ సంపద అద్భుతంగా ఉందని కొనియాడారు.

నైపుణ్య శిక్షణతో

ఉపాధి అవకాశాలు

ఏటూరునాగారం: గిరిజన నిరుద్యోగ యువతీయువకులు నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో మంగళవారం నైపుణ్య శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌ పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. ఐటీడీఏ పరిధిలోని ఐదు యువజన శిక్షణ కేంద్రాల్లో అందిస్తున్న వివిధ కోర్సుల గురించి అధికారులు యువతకు అవగాహన కల్పించాలని సూచించారు. శిక్షణ సమయంలో అభ్యర్థులకు యూనిఫాం, స్టడీ మెటీరియల్‌తో పాటు భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. గిరిజన యువత తమ నైపుణ్యాలను పెంపొందించుకుని స్వయం ఉపాధి, ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని పీఓ సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ పి.హరిప్రసాద్‌, జేడీఎం కొండల్‌ రావు, యువజన శిక్షణ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement