వెంకటాపురం(ఎం): మండలంలోని ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయాన్ని టర్కీ దేశానికి చెందిన విద్యావంతుల ఐక్యతా సంఘం ప్రతినిధులు మోసూత్ ఒమర్, నూరుల్లా, రోజ్, ఆ శ్విన్‌కుమార్‌లతో కలిసి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రామప్ప రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా ఆలయ పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గు రించి గైడ్ విజయ్‌కుమార్ వివరించగా, ప్రతీ శిల్పం యొక్క ప్రాధాన్యం గురించి అడిగి తెలుసుకున్నా రు. నీటిలో ఇటుకలు తేలాడడం, సరిగమలు పలికే పొన్నచెట్టు, సాండ్ బాక్స్ టెక్నాలజీ, ముగ్గురికి నాలుగే కాళ్లు లాంటి శిల్పాలను చూసి అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. వారి వెంట పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు పులగం దామోదర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకర భిక్షం గౌడ్, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగం మహేంద్ర రెడ్డి, ములుగు జిల్లా అధ్యక్షుడు యాకూబ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కోకిల శ్రీరంగం, నాయకులు ఆడిచెర్ల రాజయ్య, కమలాకర్ తదితరులు ఉన్నారు.
రామప్పను సందర్శించిన అమెరికా దేశస్తులు
మండలంలోని చారిత్రాత్మక రామప్ప దేవాలయాన్ని అమెరికా దేశస్తులు సందర్శించారు. రామలింగేశ్వరస్వామిని వారు దర్శించుకోగా పూజారులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. ఆలయ విశిష్టత గైడ్ వెంకటేష్ వివరించారు.


