ఉచిత వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఉచిత వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలి

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

ములుగు: తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులతో బా ధపడుతున్న షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలకు చెందిన అర్హులైన రోగులు ‘డాక్టర్‌ అంబేడ్కర్‌ మెడికల్‌ ఎయిడ్‌ స్కీమ్‌’ కింద అందించే వైద్య సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు కోరారు. జిల్లా నూతన కలెక్టరేట్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ప్రత్యేక వైద్య చికిత్స, శస్త్రచికిత్స అవసరమైన ఎస్సీ, ఎస్టీ వర్గాల రోగులకు ఆర్థిక సహాయం అందించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. గుండె సంబంధిత శస్త్రచికిత్సలు, మూత్రపిండ వ్యాధులకు డయాలసిస్‌, కేన్సర్‌కు కీమోథెరపీ, రేడియోథెరపీ, మెదడు సంబంధిత శస్త్రచికిత్సలు, మూత్రపిండాలు, కాలేయం తదితర అవయవాల మార్పిడి, వెన్నెముక శస్త్రచికిత్సలతోపాటు ఇతర ప్రాణాంతక వ్యాధుల చికిత్సకు ఈ పథకం కింద ఆ ర్థిక సహాయం పొందవచ్చన్నారు. జిల్లాలో ఈ పథకంపై విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అర్హులైన రోగులు అవసరమైన ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తు చేసుకొని సహాయం పొందాలన్నారు.

కలెక్టర్‌ బోర్ఖడే హేమంత్‌ సహదేవరావు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement