రోబోటిక్స్‌ ప్రయోగశాలను సద్వినియోగం చేసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

రోబోటిక్స్‌ ప్రయోగశాలను సద్వినియోగం చేసుకోవాలి

Sep 19 2026 6:20 AM | Updated on Sep 19 2026 6:20 AM

ములుగు రూరల్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రోబోటిక్స్‌ ప్రయోగశాలను వి ద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కళాశా ల ప్రిన్సిపాల్‌ కొప్పుల మల్లేషం అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాశాల రోబోటిక్స్‌ వర్క్‌షాప్‌ను హైదరాబాద్‌కు చెందిన సోహం అకా డమీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సమాజంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలన్నారు. సంస్థ రి సోర్స్‌ పర్సన్‌ శంకర్‌, పావని, కృష్ణతేజ, సుశ్మి త, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

విచారణ ప్రక్రియను

వేగవంతం చేయాలి

వెంకటాపురం(ఎం): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేసిన నోటీసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్‌ అధికారి కృష్ణవేణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం మండలంలోని వెంకటాపూర్‌, లక్ష్మీదేవిపేట గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి తనిఖీ చేశారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులు, జారీ చేసిన నోటీసులు, వాటిపై చేపడుతున్న విచారణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నోటీసులకు సంబంధించిన విచారణను క్షేత్రస్థాయిలో సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. ప్రతీ దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఓటర్ల వివరాలను నిర్ధారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ భవానీ ప్రసాద్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ నగేష్‌, బూత్‌ స్థాయి అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

27న బీసీ, ఎస్సీ, ఎస్టీల బహిరంగ సభ

ములుగు: సామాజిక న్యాయం, రాజ్యాధికా రం కోసం బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఐక్యంగా ఉద్యమించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ నెల 27న హనుమకొండ హంటర్‌ రోడ్డులోని డీ కన్వెన్షన్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగసభను విజయవంతం చేయాలని కోరారు. సభకు సంబంధించిన కరపత్రాలను శుక్రవారం ములుగు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఆవిష్కరించారు. జేఏసీ జిల్లా చైర్మన్‌ ముంజల భిక్షపతి గౌడ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఉమ్మ డి వరంగల్‌ జిల్లా చైర్మనన్‌, రిటైర్డ్‌ ప్రొఫెసర్‌ చందా మల్లయ్య, రాష్ట్ర కార్యదర్శి పొదిళ్ల సాయిబాబా, ఉమ్మడి వరంగల్‌ జిల్లా కోఆర్డినేటర్‌ మేకల సుమన్‌ తదితరులు పాల్గొన్నారు.

రూ.12లక్షల ఆదాయం

భూపాలపల్లి: ఇసుక, కలప అక్రమ రవాణా తదితర కేసులలో అటవీశాఖ అధికారులకు పట్టుబడిన వాహనాలకు శుక్రవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో టెండరు ప్రక్రియ ద్వారా వేలం నిర్వహించి డ్రా తీశారు. మొత్తం 47 వాహనాలకు వేలం వేయగా శాఖకు రూ.12 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్‌ఓ కిష్టాగౌడ్‌, ఎఫ్‌డీఓ అప్పలకొండ, ఎఫ్‌ఆర్‌ఓ సృజనకుమారి, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement