ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని గిరిజన వి ద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి మరింత పెరుగుపర్చాలని, అనారోగ్య సమస్యలు రాకుండా చూడాలని ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ఐటీడీఏ సమావేశం మందిరంలో ఆరోగ్యశాఖ, ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ కార్యాలయానికి వచ్చే గిరిజనులకు అధికారులు, సిబ్బంది మెరుగైన సేవలు ఇవ్వాలన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై దృష్టి పెట్టాలని, దోమలు, వాహకాల ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణ (మలేరియా, డెంగీ, చికున్‌గున్యా, ఫైలేరియా వంటి కేసులను గుర్తించాలన్నారు. ఆస్పత్రుల్లో అవసరమైన మందులతో పాటు మౌలిక వసతులు కల్పించాలన్నారు. ఐటీడీఏ ఇంజనీరింగ్ పెండింగ్‌లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని ఈఈ ప్రవీణను ఆదేశించారు. సమావేశంలో ఏపీఓ దామోదరస్వామి, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్, ఈఈ ప్రవీణ, పీహెచ్‌సీల మెడికల్ ఆఫీసర్లు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
విధుల్లో అంకితభావంతో పనిచేయాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్యాధికారులు, సిబ్బంది అంకితభావంతో పనిచేయాలని ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ లెనిన్ వ త్సల్ టొప్పో అన్నారు. శుక్రవారం మండలపరిధి లోని ఎదిర వైద్యశాలను ఆకస్మికంగా తనిఖీ చేశా రు. సిబ్బంది హాజరు పట్టిక, వైద్యశాలకు మంజూ రైన మొత్తం సిబ్బంది సంఖ్య, పోస్టుల వివరాలు, ఖాళీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది క్రమం తప్పకుండా హాజరు కావటాన్ని పర్యవేక్షించాలని పల్లె దవాఖానా వైద్యాధికారిని ఆదేశించారు. అనంతరం రోగులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టొప్పో


