వెంకటాపురం(ఎం): రామప్ప దేవాలయం ఆవరణలో గురువారం రాత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా సంకల్ప్ అభియాన్‌లో భాగంగా ‘ఆశీర్వాద దీపం’ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కాగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు దీపాలు వెలిగించారు. పీఎం బాగుండాలని వేడుకున్నారు. నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ మాట్లాడుతూ మోదీ ప్రజాసేవకు అంకితమై దేశాభివృద్ధికి పాటు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణవేణి నాయక్, జవహర్‌లాల్, సుమలత తదితరులు పాల్గొన్నారు.
దీపాలు వెలిగించి పూజలు చేసిన
బీజేపీ నాయకులు


