ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మండల పరిధిలోని మేడారంలో కొలువైన సమ్మక్క–సారలమ్మను బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు పూనమ్ ఆలువాలియా, అపూర్వ శెన్వీ, వెంకటరావు, నిత్య, నేహ ప్రవాష్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకుముందు ఆలయ పూజారులు.. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు డోలువాయిద్యాలతో గద్దెల వద్ద ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి కండువా కప్పి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా హనుమకొండ హార్టికల్చర్, పర్యాటక శాఖ అధికారి శివాజీ.. మేడారంలో జరుగుతున్న వివిధ పనుల వివరాలు వివరించారు. అనంతరం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు లక్నవరం సరస్సును సందర్శించారు. వారి వెంట గ్రూప్–1 అధికారి రవళి, పర్యాటక శాఖ అధికారులు ఉన్నారు.
ఖిలా వరంగల్ కోట కూడా సందర్శన..
ఖిలా వరంగల్ : చారిత్రక ఖిలా వరంగల్ కోటను బుధవారం ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు సందర్శించారు. ఈసందర్భంగా అద్భుత శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఖుష్‌మాహాల్, రాతి, మట్టికోట, ఏకశిలగుట్ట అందాలను వీక్షించారు. కాకతీయ చరిత్ర, విశిష్టతను గైడ్ రవి యాదవ్ వివరించారు.కోఆర్డినేటర్ శ్రీకాంత్, టీజీ టీడీసీ ఇన్‌చార్జ్ అజయ్ పాల్గొన్నారు.
తల్లులకు ప్రత్యేక పూజలు
ఘన స్వాగతం పలికిన పూజారులు


