ములుగు: జిల్లా కేంద్రంలోని నూతన సమీకృత కలెక్టరేట్ నేడు(గురువారం) నిర్వహించనున్న ప్రజా పాలన దినోత్సవ వేడుకలకు ముస్తాబైంది. వేడుకల కోసం స్టేజీ ఏర్పాటుతో పాటు వేడుకలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల కోసం ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు మంత్రి సీతక్క వేడుకలకు హాజరై జాతీయజెండాను ఆవిష్కరించి మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ హేమంత్ సహదేవరావు, ఎస్పీ సుధీర్ రాంనాథ్‌కేకన్‌తో పాటు అదనపు కలెక్టర్లు, జిల్లా అధికారులు పాల్గొనున్నారు.


