సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

సీజనల్‌ వ్యాధుల నివారణకు చర్యలు

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

శిక్షల శాతాలు ఇలా..

ఎస్‌ఎస్‌ తాడ్వాయి: సీజనల్‌ వ్యాధుల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్‌ ఆఫీసర్‌ లెనిన్‌ వత్సల్‌ టొప్పో వైద్య సిబ్బందిని ఆదేశించారు. తాడ్వాయి, గోవిందరావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రుల్లోని రోగులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యసేవలు, సదుపాయాలపై ఆరా తీశారు. తాడ్వాయి వైద్యాధికారి డాక్టర్‌ ప్రశాంత్‌, గోవిందరావుపేట వైద్యాధికారి అనూషతో ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మందుల నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టాక్‌ రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి రోగులకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. గ్రామపంచాయతీ సిబ్బంది సహకారంతో గ్రామాల్లో మలేరియా నివారణకు దోమల మందు పిచికారీ చేయడంతో పాటు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement