రాజీమార్గమే రాజమార్గం | - | Sakshi
Sakshi News home page

రాజీమార్గమే రాజమార్గం

Sep 13 2026 1:06 AM | Updated on Sep 13 2026 1:06 AM

ములుగు: రాజీమార్గమే రాజమార్గం అని, కక్షిదారులు లోక్‌ అదాలత్‌ ద్వారా కేసులను రాజీ చేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చండీశ్వరీ దేవి అన్నారు. జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. లోక్‌ అదాలత్‌లో కుదిరిన రాజీకి అప్పీల్‌ ఉండదని, ఇదే అంతిమ తీర్పుగా ఉంటుందని వెల్లడించారు. నాలుగు బెంచీల ద్వారా మొత్తం 2,881 కేసులను పరిష్కరించినట్లు వివరించారు. ఇందులో పెండింగ్‌లో ఉన్న 691 వివిధ కేసులు, 2,183 ట్రాఫిక్‌ చలానన్‌ కేసులు, 7 సైబర్‌ క్రైమ్‌ కేసులను పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి టి.కన్నయ్యలాల్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి జి.జోత్స్న, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ కె.శంకర్‌, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు బి.చంద్రయ్య, జనరల్‌ సెక్రటరీ కొండి రవీందర్‌, డీఎస్పీ రవీందర్‌, న్యాయవాదులు, పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.

న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి

చండీశ్వరీదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement