గణపురం: యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) ప్రైవేటీకరణను తక్షణమే నిలిపివేయాలని కేటీపీపీ జేఏసీ నాయకులు శుక్రవారం కేటీపీపీ సీఈ కార్యాలయాన్ని ముట్టడించారు. టీజీపీఈ జేఏసీ పిలుపు మేరకు జేఏసీ నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల ప్రయోజనాలు, రాష్ట్ర విద్యుత్ రంగ భద్రత, ఉద్యోగుల హక్కులను దృష్టిలో ఉంచుకొని ప్రైవేటీకరణ చర్యలను విరమించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఇంజనీర్లు, ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.


