పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే చర్యలు

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

ములుగు: కేసులను పెండింగ్‌ పెడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ అన్నారు. శుక్రవారం ములుగు జిల్లా పోలీస్‌ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌ ఆధ్వర్యంలో ఆగస్టు మాసం క్రైమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సమావేశం ఏటూరునాగారం ఏఎస్పీ మనన్‌ భట్‌, డీఎస్పీ నలువాల రవీందర్‌ ఆధ్వర్యంలో క్రైమ్‌ సమావేశం జరిగింది. వినాయకుడి ఉత్సవాల సూచనలతో కూడిన వాల్‌పోస్టర్‌ను అధికారులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పోలీస్‌ స్టేషన్ల వారీగా పెండింగ్‌ కేసుల వివరాలను సమీక్షించి, కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదైన వెంటనే సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేసి, అక్కడ తక్షణమే ఎఫ్‌ఐఆర్‌ రీ రిజిస్ట్రేషన్‌ చేసి తదుపరి దర్యాప్తును చేపట్టేలా పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో నమోదైన సైబర్‌ క్రైమ్‌ కేసుల పురోగతిని సమీక్షిస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా దర్యాప్తును వేగవంతం చేయాలని సూచించారు.

ఉత్సవాలకు సమన్వయంతో పనిచేయాలి

రానున్న గణేష్‌ ఉత్సవాలు ప్రశాంతంగా, విజయవంతంగా జరిగేలా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. స్థానిక ప్రజలు, గణేష్‌ ఉత్సవ నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ పనిచేయాలన్నారు. ఉత్సవాల సందర్భంగా శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టడంతో పాటు, ప్రజల సహకారంతో గణేష్‌ ఉత్సవాలను సురక్షితంగా నిర్వహించేందుకు పోలీస్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ ఆదేశించారు. నిబద్ధతతో పనిచేసిన అధికారులకు ప్రశంసపత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీఐలు దారం సురేష్‌, దయాకర్‌, సూర్యప్రకాష్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌, ఆర్‌ఐ అడ్మిన్‌ రాధారత్‌ స్వామి, రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆపరేషన్‌ తిరుపతి, ఆర్‌ఐ ఎంటీఓ వెంకటనారాయణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

జీరో ఎఫ్‌ఐఆర్‌ను

తక్షణమే నమోదు చేయాలి

ఉత్సవాలను ప్రశాంతంగా

జరుపుకోవాలి

ఎస్పీ సుధీర్‌ రాంనాథ్‌ కేకన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement