అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి | - | Sakshi
Sakshi News home page

అమరుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలి

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

ఏటూరునాగారం: అమరుల త్యాగాలను విధి నిర్వహణలోని ఉద్యోగులను స్ఫూర్తిగా తీసుకోవాలని అటవీశాఖ ఎఫ్‌డీఓ రమేష్‌, ఎఫ్‌ఆర్‌ఓ అబ్దుల్‌ రెహమాన్‌ అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని నాలుగు రేంజ్‌ అధికారులు, సిబ్బంది కలిసి ఫారెస్ట్‌ ఆఫీస్‌ నుంచి బస్టాండ్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విధి నిర్వహణలో అసువులు బాసిన వారి త్యాగాలను వృథా కానివ్వమన్నారు. అటవీ సంపదను కాపాడడంలో అసువులు బాసిన ఉద్యోగులకు నివాళులర్పించారు. ప్రతి ఒక్క ఉద్యోగి అటవీ సంపదను కాపాడాలన్నారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతన్నారు. కార్యక్రమంలో తాడ్వాయి ఎఫ్‌ఆర్‌ఓ రమేష్‌, ఏటూరునాగారం ఉత్తరం ఇన్‌చార్జ్‌ ఎఫ్‌ఆర్‌ఓ అశోక్‌, పస్రా వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌చార్జ్‌ రమేష్‌, నాలుగు రేంజ్‌ల అటవీశాఖ అధికారులు, సిబ్బంది, బేస్‌ క్యాంప్‌ సిబ్బంది, ఉద్యోగులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement