పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

Sep 12 2026 1:12 AM | Updated on Sep 12 2026 1:12 AM

ములుగు: పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, మట్టి వినాయకల తయారీలో సృజనాత్మకతను వెలికితీయవచ్చని ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌– 2 ప్రోగ్రాం ఆఫీసర్‌ డాక్టర్‌ అనిల్‌కుమార్‌ తెలిపారు. శుక్రవారం పర్యావరణహిత వినాయక చవితి వేడుకలపై అవగాహన, మట్టి వినాయక విగ్రహ తయారీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 80 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ విగ్రహాలను తయారు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మట్టి వినాయక విగ్రహాలను ఉపయోగించడం ద్వారా పర్యావరణాన్ని, ముఖ్యంగా నీటి వనరులను కాలుష్యం నుంచి కాపాడవచ్చన్నారు. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ (పీఓపీ) విగ్రహాలు, రసాయనిక రంగులతో నీటి వనరులకు కలిగే నష్టాన్ని తగ్గించేందుకు ప్రతిఒక్కరూ పర్యావరణహిత మట్టి వినాయకులను ప్రోత్సహించాలన్నారు. ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.బా లయ్య మాట్లాడుతూ పండుగలను సంప్రదాయబద్ధంగా జరుపుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. విగ్రహాలను తయారు చేసిన విద్యార్థులకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో డా క్టర్‌ సరిత, బి.శిరీష, డి.రాధికా, పి.విజేత, ఆర్‌. తే జోలత, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.

డిగ్రీ కళాశాలలో

మట్టి వినాయక విగ్రహాల తయారీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement