ఎస్‌ఎస్‌తాడ్వాయి: విద్యార్థులు విద్యతోపాటు క్రీడల్లోనూ రాణించాలని జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి అన్నారు. శుక్రవారం మండలకేంద్రంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలోని క్రీడా మైదానంలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన 70వ మండలస్థాయి క్రీడా పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువును నిర్లక్ష్యం చేయకూడదని, మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండాలన్నారు. విద్య, క్రీడలు రెండూ విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో కీలకమన్నారు. క్రీడాకారులు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ప్రతిభ చాటి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అండర్–14, 16 విభాగాల్లో ఖోఖో, కబడ్డీ, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈక్రీడల్లో విజయం సాధించిన క్రీడాకారులకు బహమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం రేవతి, మండల క్రీడా కన్వీనర్, ఎంఈఓ శ్రీనివాస్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఆదినారాయణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వంక రాంచందర్, ఫిజికల్ డైరెక్టర్ గడ్డం లక్ష్మీనారాయణ, పీఈటీలు విజయ, సతీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్
రేగ కల్యాణి


