ములుగు: బంజారాల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా తీజ్ పండుగ జరుపుకుంటారని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవిచందర్ పేర్కొన్నారు. మున్సిపాలిటీ పరిధిలోని జీవంతరావుపల్లిలో గురువారం నిర్వహించిన బంజారా తీజ్ పండుగ వేడుకలకు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కల్యాణితో రవిచందర్ హాజరై మాట్లాడారు. యువతులు, మహిళలు తొమ్మిది రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించడం ఆనవాయితీ అన్నారు. తీజ్ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని, బంజారా సోదరసోదరీమణులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి సీతక్క తరఫున యువతులకు రూ.10 వేల నగదును రవిచందర్ అందజేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు పద్మ దేవ్‌సింగ్, ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ రేవంత్ యాదవ్ పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ రవిచందర్


