పారదర్శకంగా లక్కీ డ్రా | - | Sakshi
Sakshi News home page

పారదర్శకంగా లక్కీ డ్రా

Sep 11 2026 11:15 AM | Updated on Sep 11 2026 11:15 AM

ములుగు: కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగా లక్కీ డ్రా నిర్వహించి పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ తెలిపారు. వెంకటాపురం(ఎం) మండల పరిధిలోని జవహర్‌నగర్‌ ఆదర్శ పాఠశాలలో నిర్వహిస్తున్న కేంద్రీయ విద్యాలయంలో ప్రవేశాలకు గురువారం కలెక్టరేట్‌లో లక్కీ డ్రా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రీయ విద్యాలయ ప్రవేశాల ప్రక్రియను పూర్తి పారదర్శకంగా, పైరవీలకు తావులేకుండా లక్కీ డ్రా ప్రక్రియ పూర్తి చేసినట్లు స్పష్టం చేశారు. దరఖాస్తుల పరిశీలన, అర్హతల నిర్ధారణతో పాటు అందుబాటులో ఉన్న సీట్లను లక్కీ డ్రా ద్వారా భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ రెడ్డి, కేంద్రీయ విద్యాలయ ప్రధానాచార్యులు సీతారాం, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement