ములుగు: ఆత్మహత్యల నివారణపై మౌనం వీడి మానసిక, ఆరోగ్య సమస్యలపై బహిరంగంగా చర్చించాలని, సంక్షోభంలో ఉన్న వారికి ధైర్యం, ఓదార్పు చెప్పి సకాలంలో సహాయం అందించడం ద్వారా వారి ప్రాణాలను కాపాడవచ్చని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో గురువారం ములుగులో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు మాట్లాడుతూ తీవ్ర ఒత్తిడి, నిరాశతో బాధపడుతున్న వారిని కుటుంబ సభ్యులు, స్నేహితులు గుర్తించి మానసికంగా అండగా నిలవాలని సూచించారు. అవసరమైతే నిపుణుల ద్వారా కౌన్సెలింగ్ అందించాలని సూచించారు. మానసిక ఆరోగ్య సమస్యలపై సలహాలు, సూచనలకు టోల్‌ఫ్రీ నంబర్ 14416కు ఫోన్ చేయవచ్చని తెలిపారు. అనంతరం సిబ్బందితో ఆత్మహత్యల నివారణపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఇన్‌చార్జ్ సూపరింటెండెంట్ భిక్షపతిరావు, ఏసీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రంజిత్, సైకియాట్రిస్ట్ గౌతమ్, డాక్టర్ శ్రీకాంత్, మాస్ మీడియా అధికారి సంపత్, వెంకట్‌రెడ్డి, ఆర్‌బీఎస్‌కే వైద్యులు, సిబ్బంది, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు


