● మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్
ములుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎంపీ అజ్మీరా సీతారాంనాయక్ పిలుపునిచ్చారు. బీజేపీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన సేవా సంకల్ప్ అభియాన్ సమావేశానికి సీతారాంనాయక్ హాజరై మాట్లాడారు. నరేంద్రమోదీ ప్రజాసేవ, జీవితం, అంకితభావాన్ని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో బీజేపీ దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ నిర్వహిస్తోందన్నారు. మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈనెల 17 నుంచి అక్టోబర్ 17 వరకు నెలరోజుల పాటు జిల్లాలోని ప్రతి బూత్‌లో వివిధ సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షుడు చింతలపూడి భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భూక్య జవహర్ లాల్, నాయకులు బలరాం, నగరపు రమేశ్, అల్లె శోభన్, కొర్ర సుమలత, జినుకల కృష్ణాకర్ రావు, ఏనుగు రవీందర్‌రెడ్డి మద్దినేని తేజరాజు తదితరులు పాల్గొన్నారు.


