ఆశ వర్కర్ల అరెస్టులు సరికాదు | - | Sakshi
Sakshi News home page

ఆశ వర్కర్ల అరెస్టులు సరికాదు

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

ములుగు: న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ హైదరాబాద్‌లో నిర్వహించ తలపెట్టి ఆందోళనకు బుధవారం వెళ్తున్న ఆశ వర్కర్లను ముందస్తుగా అరెస్టు చేసి, నిర్బంధించడం సరికాదని తెలంగాణ ఆశ వర్కర్స్‌ యూనియన్‌ (సీఐటీయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నం నీలాదేవి ఖండించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేసి మాట్లాడారు. ఆశ వర్కర్లకు రూ.18 వేల కనీస వేతనం, పెండింగ్‌ బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత, ఇన్సూరెన్స్‌, రిటైర్మెంట్‌ ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్‌ చేశారు. అరెస్టులు, బెదిరింపులతో ఉద్యమాన్ని అణచలేరని, సమస్యలు పరిష్కరించే వరకు పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement