పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

ములుగు: అంగన్‌న్‌వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలని జిల్లా సంక్షేమ అధికారి ఈసంపెల్లి ప్రేమలత తెలిపారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రథమ్‌ ఎడ్యుకేషన్‌ ఫౌండేషన్‌ సహకారంతో జిల్లా కేంద్రంలోని సంక్షేమ భవనంలో సీడీపీఓలు, సూపర్‌వైజర్లకు బుధవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లల వయస్సు, అభ్యాస స్థాయికి అనుగుణంగా కార్యకలాపాలు నిర్వహించడం, అంగన్‌వాడీల నిర్వహణ, పర్యవేక్షణ, అభ్యాస స్థాయి మూల్యాంకనంపై శిక్షణ ఇచ్చారు. 9వ రాష్ట్రీయ పోషణ మాసం–2026లో భాగంగా మన అంగనన్‌వాడీ–మన బాధ్యత కార్యక్రమం నిర్వహించి, పౌష్టికాహారం, ఆరోగ్యం, పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. జంక్‌ఫుడ్‌ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపడతామని ప్రేమలత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, డీఈఓ సిద్ధార్థరెడ్డి, ప్రథమ్‌ ప్రతినిధులు, సీడీపీఓలు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement