వైభవంగా మహా లింగార్చన | - | Sakshi
Sakshi News home page

వైభవంగా మహా లింగార్చన

Sep 10 2026 1:27 AM | Updated on Sep 10 2026 1:27 AM

కాళేశ్వరం : మాసశివరాత్రి సందర్భంగా కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వరముక్తీశ్వర స్వామి బాలాలయంలో మహాలింగార్చన కార్యక్రమం బుధవారం వైభవంగా నిర్వహించారు. దేవస్థానం ఉప ప్రధాన అర్చకుడు ఫణీంద్రశర్మ, అర్చకుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు సత్యనారాయణ, శ్రీధర్‌రావు, నర్సయ్య, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

కాళోజీ ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకం

భూపాలపల్లి: తెలంగాణ ప్రజాకవి, ఉద్యమాల గొంతుక కాళోజీ నారాయణరావు ఆశయాలు ప్రజాసేవకు మార్గదర్శకమని అదనపు ఎస్పీ నరేష్‌కుమార్‌ అన్నారు. బుధవారం కాళోజీ జయంతిని పురస్కరించుకొని జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాలలు వేశారు. అనంతరం ఏఎస్పీ మాట్లాడుతూ.. కవిత్వం ద్వారా తెలంగాణ ప్రజల సమస్యలను సమాజానికి ఎలుగెత్తి చాటిన మహోన్నత వ్యక్తి కాళోజీ అని ఎస్పీ కొనియాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement