గోవిందరావుపేట: విద్యార్థుల భవిష్యత్‌కు విద్యాశాఖ భరోసా కల్పిస్తుందని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి అన్నారు. మండల పరిధిలోని పీఎస్‌ఆర్ గార్డెన్‌లో మంగళవారం సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో సమ్మిళిత విద్యపై ప్రత్యేక అవసరాలు గల పిల్లల తల్లిదండ్రులు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, క్లస్టర్ రీసోర్స్ పర్సన్లు, నాన్ టీచింగ్ సిబ్బందికి ఒకరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ సిద్ధార్థరెడ్డి మాట్లాడుతూ ప్రతీ మండలంలో భవిత కేంద్రాలతో పాటు ప్రత్యేక విద్యా ఉపాధ్యాయులు అందుబాటులో ఉన్నారని తెలిపారు. పిల్లల్లోని వైకల్యాలను గుర్తించేందుకు వారి సేవలను తల్లిదండ్రులు వినియోగించుకోవాలని సూచించారు. పిల్లల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులపై ఉందన్నారు. సమగ్ర శిక్ష కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సాంబయ్య మాట్లాడారు. ఈ నెల 8న మరోసారి ఉపకరణాల నిర్ధారణ శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష కోఆర్డినేటర్లు సైకం శ్రీనివాసరెడ్డి, బి.శ్యాంసుందర్‌రెడ్డి, ఉల్లాస్ కోఆర్డినేటర్ పీర్ల కృష్ణబాబు పాల్గొన్నారు.
జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థరెడ్డి


