డ్రెయినేజీలు నిర్మించిన తర్వాత సీసీ రోడ్లు వేయాలి. పట్టణంలో నూతనంగా సీసీ రోడ్లు వేస్తుండడంతో డ్రెయినేజీల్లో మురుగునీరు ఎక్కడికక్కడే నిలిచిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. పట్టణంలోని అంతర్గత రహదారులను విస్తరించి సీసీ రోడ్లు నిర్మించాలి. ఇరుకై న రహదారులతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కొరతను నివారించేందుకు అదనంగా ఓవర్ హెడ్ ట్యాంకులు నూతనంగా నిర్మించాలి.
– భూక్య జవహర్‌లాల్, 20వ వార్డు
పట్టణంలో ప్రధానంగా డ్రెయినేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో పట్టణానికి చెందిన మురుగునీరంతా బండారుపల్లి చెరువులోకి చేరి అక్కడి నుంచి రామప్ప సరస్సులోకి వెళ్తోంది. మురుగునీటిి యంత్రాన్ని కొనుగోలు చేసి రీసైక్లింగ్ చేస్తే ఆ నీటిని పొలాలకు తరలించి సాగునీటిగా వాడుకోవచ్చు. మున్సిపాలిటీ పరిధిలో 130 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉన్నప్పటికీ తక్కువ వేతనం కారణంగా సుమారు 80 మంది మాత్రమే విధులకు హాజరవుతుండడంతో పట్టణంలో పారిశుద్ధ్య సమస్య నెలకొంటుంది.
– గండ్రకోట వాణికుమార్, 9వ వార్డు కౌన్సిలర్


