కొండా సురేఖ ఎపిసోడ్‌కు బర్తరఫ్‌తో ఎండ్‌ కార్డు | - | Sakshi
Sakshi News home page

కొండా సురేఖ ఎపిసోడ్‌కు బర్తరఫ్‌తో ఎండ్‌ కార్డు

Sep 4 2026 1:12 AM | Updated on Sep 4 2026 1:12 AM

అప్పుడు రాజయ్య.. ఇప్పుడు సురేఖపరకాల కేంద్రంగానే ‘కొండా’ రెండు నిర్ణయాలు

సాక్షి ప్రతినిధి, వరంగల్‌:

మంత్రి పదవినుంచి బర్తరఫ్‌తో సుమారు 18 రోజుల కొండా సురేఖ ఎపిసోడ్‌కు గురువారం ఎండ్‌ కార్డు పడింది. పరకాల వేదికగా మొదలైన రాజకీయ వివాదం.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను దాటి ఢిల్లీకి చేరింది. అక్కడ కాంగ్రెస్‌ అధిష్టానం స్థాయిలో జరిగిన చర్చలు.. మంత్రివర్గం నుంచి బయటకు పంపే స్థాయికి చేరాయి. కూతురు కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో మొదలైన ఈ వివాదం.. ఆ తర్వాత వరుస ఫిర్యాదులు, ఎమ్మెల్యేల నివేదికలు, క్రమశిక్షణ కమిటీ రిపోర్ట్‌, ఆమె మాజీ ఓఎస్డీ సుమంత్‌ వ్యవహారం.. హైకమాండ్‌ను ఆగ్రహానికి గురి చేశాయి. చివరకు సురేఖను కేబినెట్‌ నుంచి తప్పించారు. ఆగస్టు 16 తర్వాత మొదలైన పరిణామాలు గురువారం నాటి కొండా సురేఖ బర్తరఫ్‌ వరకు జరిగిన తంతు ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.

కూతురు మాటలనుంచి కేబినెట్‌ వేటు దాకా..

ఆగస్టు 16న సీఎం రేవంత్‌రెడ్డి పరకాల పర్యటన తర్వాత చోటుచేసుకున్న పలు ఘటనలు కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక మలుపునకు నాంది పలికాయి. సురేఖ జన్మదినం సందర్భంగా ఆగస్టు 19న ఆమె కుమార్తె సుస్మిత.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో తీవ్ర అసంతృప్తికి కారణమయ్యాయి. అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తాను బాధ్యురాలిని కాదని, వాటితో తనకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. పార్టీ వర్గాల్లో మాత్రం సురేఖ వైఖరిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సురేఖపై ఈ ఒక్క అంశమే కాకుండా.. మరికొన్నింటితో కూడిన ఫిర్యాదుల ఫైల్‌ అధిష్టానం ముందుకు వెళ్లినట్లు ప్రచారం. కూతురు చేసిన వ్యాఖ్యల వివాదంపై రంగంలోకి దిగిన టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ సైతం సురేఖపై చర్యలు తీసుకోవాలని సిఫారసు చేయడం ఈ వ్యవహారంలో కీలక మలుపుగా మారింది. ఇదే సమయంలో సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్‌పై నమోదైన కేసు, అందులో వెలుగులోకి వచ్చిన ఆరోపణలు అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు చెబుతున్నారు. వీటన్నింటిపై సుదీర్ఘంగా చర్చించిన తర్వాత సురేఖ స్వచ్ఛందంగా తప్పుకునే పరిస్థితి లేదని భావించి బర్తరఫ్‌ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించడం గమనార్హం.

ఇప్పటికై తే ఇంతే.. ఎమ్మెల్యేగా సురేఖ

మంత్రి పదవి పోయినా.. సురేఖ రాజకీయ ప్రస్థానం ముగి సినట్లు కాదు. ఇప్పటికే ఈ విషయమై మీడియా సమావేశంలో క్లారిటీ ఇచ్చారు. తానేమీ తప్పు చేయలేదని, పదవిపోతే బాధ పడాల్సిన అవసరం లేదన్న ఆమె.. వరంగల్‌ తూర్పు నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యేగా కొనసాగుతానన్నా రు. కేబినెట్‌ నుంచి బర్తరఫ్‌ అయినప్పటికీ సోనియా, రాహు ల్‌, ప్రియాంకా గాంధీలంటే ఇష్టమన్న ఆమె.. ఎమ్మెల్యేగా తన తదుపరి అడుగులు ఎలా ఉంటాయన్నది ఇప్పుడే చెప్పలేమనడం ఆసక్తికరంగా మారాయి. ఉమ్మడి వరంగల్‌ కాంగ్రెస్‌ రాజకీయాలపై ఈ పరిణామాలు భవిష్యత్‌లో ఎలాంటి ప్రభావం చూపుతాయన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జరుగుతోంది.

‘పరకాల’నుంచి మొదలైన మాటల దాడి..

ఎమ్మెల్యేల నివేదికలతో

ముదిరిన పంచాయితీ

క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో కీలక మలుపు

ఉత్కంఠ రేపిన ఢిల్లీ మంతనాలు..

చివరకు కేబినెట్‌నుంచి వేటు

18రోజులపాటు ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో రాజకీయ ప్రకంపనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement