వెంకటాపురం(ఎం): పర్యాటక ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని ఉమ్మడి వరంగల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి శివాజి, సీఆర్‌ఎంవైఆర్‌కే రాజు అన్నారు. ఈ మేరకు ప్రజాపాలన 99రోజుల ప్రణాళికలో భాగంగా మండలంలోని పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప చెరువు బోటింగ్ పాయింట్ వద్ద శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యాటక ప్రదేశాలను పరిశుభ్రంగా మార్చాలన్నారు. పర్యాటక ప్రాంతాలు పరిశుభ్రంగా ఉన్నప్పుడే ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీడీసీ ఏఈ విజయ్ కుమార్, టూరిజం గైడ్స్ గోరంటాల విజయ్ కుమార్, వెంకటేశ్, టూరిస్ట్ పోలీసులు అరుణ్, దశరథం, బోటింగ్ ఇన్‌చార్జ్ సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.


