ఈద్‌ కా తోఫా పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఈద్‌ కా తోఫా పంపిణీ

Mar 13 2026 7:47 AM | Updated on Mar 13 2026 7:47 AM

కాళేశ్వరం(మహదేవపూర్‌): రంజాన్‌ మాసం సందర్భంగా ప్రభుత్వం పంపిణీ చేసిన ఈద్‌ కా తోఫాను మహదేవపూర్‌ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గురువారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ కోట రాజబాబు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ప్రతీ ఒక్కరు సోదరాభావంతో మెలగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ హసీనాఅక్బర్‌ఖాన్‌, మసీదుల సదర్లు తాజోద్దీన్‌, ముజుఖాన్‌, మాజీ మసీద్‌ కమిటీ సదర్‌ దయాజ్‌ఖాన్‌, నాయకులు వామన్‌రావు, ఉప సర్పంచ్‌ శ్రీజ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement