రామప్పలో నీతి ఆయోగ్‌ అధికారి | - | Sakshi
Sakshi News home page

రామప్పలో నీతి ఆయోగ్‌ అధికారి

Mar 13 2026 7:47 AM | Updated on Mar 13 2026 7:47 AM

వెంకటాపురం(ఎం): మండల పరిధిలోని పాలంపేటలో గల రామప్ప దేవాలయాన్ని నీతి ఆయోగ్‌ గ్రేడ్‌ వన్‌ అధికారి కృష్ణన్‌గోపాల్‌ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఉమాశంకర్‌ రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ఈవో ఇమ్మడి భాస్కర్‌ శాలువాతో వారిని సత్కరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ విశిష్టత గురించి టూరిజం గైడ్‌ గోరంటల విజయ్‌ కుమార్‌ వివరించారు. వారి వెంట నీతి ఆయోగ్‌ జిల్లా కోఆర్డినేటర్‌ రవిష్‌, దేవాదాయ శాఖ సిబ్బంది అవినాష్‌, సంతోష్‌, టూరిస్ట్‌ పోలీస్‌ అరుణ్‌ తదితరులు ఉన్నారు. అనంతరం రామప్ప చెరువును సందర్శించారు.

పాఠశాల భవనం

మంజూరు చేయాలని వినతి

కన్నాయిగూడెం: మండల పరిధిలోని బుట్టా యిగూడెం గ్రామ పంచాయతీ పరిఽధిలోని కొ త్తూరులో గల పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుంది. ఈ మేరకు గ్రామస్తులు సర్పంచ్‌ దృష్టికి సమస్యను పలుమార్లు తీసుకురావడంతో గ్రామ సర్పంచ్‌ జాడి రాంబాబు జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌ దివాకరను గురువారం కలిసి భవనం మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్‌ తక్షణమే నిధులు విడుదల చేసి భవన నిర్మాణం చేపడుతామని తెలిపారని వివరించారు.

కండక్టర్‌తో వాగ్వాదం

భార్యాభర్తలపై కేసు నమోదు

భూపాలపల్లి అర్బన్‌: డబ్బుల విషయంలో ఆర్టీసీ కండక్టర్‌తో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా వాగ్వాదం చేసిన భార్యాభర్తలపై కేసు నమోదైన ఘటన భూపాలపల్లిలో గురువారం చోటుచేసుకుంది. ఎస్సై సాంబమూర్తి, కండక్టర్‌ ఎం.యమున తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హనుమకొండ నుంచి భూపాలపల్లికి వస్తుండగా పరకాలలో సులోచన అనే ప్రయాణికురాలు తన భర్తతో కలిసి బస్సు ఎక్కింది. కండక్టర్‌కు రూ.100 ఇచ్చి తన భర్తకు భూపాలపల్లి రూ.70 టికెట్‌ తీసుకోగా.. రూ.30 టికెట్‌పై కండక్టర్‌ రాసింది. చెల్పూర్‌లో బస్సు ఎక్కిన మరో ప్రయాణికుడు రూ.500 ఇచ్చి భూపాలపల్లికి రూ.30 టికెట్‌ తీసుకోగా.. 470 రూపాయలు టికెట్‌ వెనుకవైపు కండక్టర్‌ రాశారు. భూపాలపల్లిలో దిగిన తర్వాత ఇద్దరికి కలిపి రూ.500 కండక్టర్‌ ఇచ్చింది. దీంతో సులోచన తన రూ.30 తనకే ఇవ్వాలని కండక్టర్‌తో వాగ్వాదానికి దిగింది. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ విషయాన్ని కండక్టర్‌ బస్‌స్టేషన్‌ కంట్రోలర్‌కు తెలియజేయగా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో 100కు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కండక్టర్‌, మహిళా ప్రయాణికురాలిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లారు. కండక్టర్‌ ఫిర్యా దు చేయగా ప్రయాణికురాలు సులోచన, అమె భర్తపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.

నాన్‌ బెయిలబుల్‌

వారెంట్‌ జారీ

భూపాలపల్లి అర్బన్‌: కోర్టు వాయిదాలకు హాజరుకాకపోవడంతో నిందితుడు కీర్తి అక్షిత్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీచేసినట్లు సీఐ నరేష్‌కుమార్‌ తెలిపారు. 2024 సంవత్సరంలో పట్టణంలోని రాజీవ్‌నగర్‌ కాలనీకి చెందిన అక్షిత్‌పై పోలీస్‌స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి కోర్టు వాయిదాలకు హాజరు కాకపోవడంతో అతనిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరుచి రిమాండ్‌కు పంపినట్లు తెలిపారు. కోర్టు కేసులకు సంబంధించిన నిందితులు కోర్టు ఇచ్చిన వాయిదా తేదీలకు తప్పనిసరిగా హాజరు కావాలని, లేకపోతే కోర్టు జారీచేసే వారెంట్ల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement