ఆకతాయిలకు అడ్డాగా..
బృహత్ పల్లెప్రకృతి వనాలు
ఏటూరునాగారం: జిల్లాలో మొక్కల పెంపకమే లక్ష్యంగా గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం బృహత్ పల్లె ప్రకృతి వనాలను రూ. 20ల వరకు ఖర్చు చేసి ఏర్పాటు చేసింది. అవి ఇప్పుడు పశువులకు కేంద్రాలుగా, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారాయి. 2023లో సర్పంచ్‌ల ఆధీనంలో ఉన్న పల్లె ప్రకృతి వనాలను అభివృద్ధి చేసేందుకు ఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద నిధులు మంజూరు చేశారు. దీంతో జిల్లాలోని 9 మండలాల్లో 25 బృహత్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గ్రామ పంచాయతీల పరిధిలోని కూలీలతో మొక్కలను నాటించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. వనాల్లో మొక్కల పెంపకం లక్షల రూపాయలు ఖర్చు చేసి బోరు, డ్రిప్, విద్యుత్ మోటారు, పైపులైన్లు ఇలా అనేక రకాల వసతులు కల్పించినట్లు లెక్కలు చూపి డబ్బులు సైతం తీసుకున్నారు. అయినా అవి ఉపయోగంలోకి రాలేదు. బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో వాకింగ్ ట్రాకర్స్, గార్డెనింగ్, మొక్కల పెంపకంతో పాటు ఇతర పండ్ల మొక్కలను నాటించేందుకు అప్పడు ప్రణాళికలను రూపొందించారు. పనులు చేపట్టిన సర్పంచులు మధ్యలోనే వాటిని వదిలేసి నిధులు కాజేశారు. ప్రభుత్వం మారడంతో పాటు సర్పంచ్‌లు సైతం వేరే వారు రావడంతో వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు.
పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలి..
బృహత్ పల్లె ప్రకృతి వనాలు అన్ని మండల కేంద్రాల్లో రోల్‌మోడల్‌గా ఉండేలా చూడాలని అప్పటి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నుంచి వాటి నిర్వహణ గు రించి పట్టించుకోకపోవడంతో అవి మరుగున పడ్డా యి. వాకింగ్ ట్రాక్, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేలా గార్డెనింగ్, కూర్చునేందుకు బేంచీలు, పండ్ల తోటలు, రక రకాల పూల మొక్కలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అప్పటి సర్పంచ్‌లు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి వాటిని ఒక స్థాయికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటి నిర్వహణపై దృష్టి సారించలేదు. దీన్నే అదునుగా భావించిన కొ ంతమంది పల్లె ప్రకృతి వనాల భూములు కబ్జాకు పాల్పడుతున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాల్లో మళ్లీ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలి. కోతులకు ఫుడ్ కోర్ట్‌లు ఏర్పాటు చేయాలి. అడవుల్లో ఎలాంటి పండ్లు లభించకపోవడంతో కోతులు గ్రామాల్లోకి వచ్చి దాడులు చేస్తున్నాయి. పండ్ల మొక్కలను పెంచి వాటికి ఆహారం వేయడంతో పాటు మంచి ఆహ్లాదకరమైన గార్డెన్లను తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి.
– గండెపల్లి నర్సయ్య,
సామాజికవేత్త, ఏటూరునాగారం
●
పలు చోట్ల బృహత్ పల్లెప్రకృతి వనంలోని భవనాలు మందుబాబులకు అడ్డాగా మారాయి. మద్యం సేవించి ఖాళీ సీసాలు, ఇతర పదార్థాలను అక్కడే పడేస్తున్నారు. పోలీసులు, ఈజీఎస్, గ్రామ పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పోకిరీలు, ఆకతాయిలకు అడ్డాగా మారాయి. అలా గే గంజాయి, కొకెన్ వంటి మత్తు పదార్థాలను కూ డా అక్కడ వినియోగిస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికై నా కాంగ్రెస్ ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారిస్తే ఆహ్లాదకరమైన వాతావరణం ప్రజలకు దొరుకుతుందని ప్రజలు కోరుతున్నారు.
కబ్జాలకు గురవుతున్న భూములు
మందుబాబులకు అడ్డాగా మారిన వైనం
పట్టించుకోని అధికారులు


