ఐటీడీఏ భవనం వెనుక ఎండలో ఉన్న 108 బైక్‌లు
ఏటూరునాగారం: ఆపదలో ఉన్న క్షతగాత్రులను ఆదుకోవాల్సిన వాహనాలు ఎండలో ఎండుతున్నాయి. మహాజాతరలో అత్యవసర సేవల నిమిత్తం తీసుకొచ్చిన 108 బైక్‌లపై అధికారులు నిర్లక్ష్యం చూపుతున్నారు. ఎస్‌ఎస్ తాడ్వాయి మండలం మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అత్యవసర సేవలను అందించడానికి రాష్ట్రంలోని భద్రాచలం, మన్ననూరు, ఉట్నూరు ఐటీడీఏ పరిధి నుంచి సుమారు 108 ద్విచక్ర వాహనాలు మేడారానికి తీసుకొచ్చారు. జాతర ముగిసి రెండు నెలలు కావస్తున్నా ఇంత వరకు ఆ వాహనాలను పట్టుకెళ్లడం లేదు. ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయం వెనుక 108 బైక్‌లు ఎండలోనే ఉండడంతో బ్యాటరీలు సైతం పక్కకు తీసి పెట్టారు. క్రమంగా బ్యాటరీల చార్జింగ్ కూడా దిగిపోతుంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక గిరిజనులు కోరుతున్నారు. ఈ విషయంపై ఐటీడీఏ డిప్యూటీ డీఎంహెచ్‌ఓ క్రాంతికుమార్‌ను వివరణ కోరగా రోడ్డు రవాణా, హెల్త్ అధికారులకు సమాచారం ఇచ్చామని, త్వరలోనే బైక్‌లను పంపించే ఏర్పాటు చేయిస్తామని వివరించారు.
మేడారం మహాజాతరకు
తీసుకొచ్చిన ద్విచక్ర వాహనాలు
డిచార్జ్ అవుతున్న బ్యాటరీలు
పట్టించుకోని అధికారులు


