● జీసీడీఓ రజిత
వెంకటాపురం(కె)/వాజేడు: పదోతరగతి విద్యార్థినులు వందశాతం ఉత్తమ ఫలితాలు సాధించాలని జీసీడీఓ రజిత సూచించారు. మండల పరిధిలోని కస్తూర్భాగాంధీ పాఠశాలను ఆమె గురువారం సందర్శించారు. పాఠశాలలోని పరిసరాలను, కిచెన్ రూమ్, తరగతి గదులను పరిశీలించారు. విద్యార్థినులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జీసీడీవో మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థినులు పరీక్షల సమయంలో భయాందోళనకు గురికావద్దన్నారు. ధైర్యంగా పరీక్షలు రాయాలని సూచించారు. చదువుల్లో రాణించి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. 8వ తరగతిలో ఎన్‌రోల్‌మెంట్ పెంచేలా చర్యలు తీసుకోవాలని టీచర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ ప్రత్యేక అధికారి శిరీష తదితరులు పాల్గొన్నారు. అనంతరం వాజేడు మండల పరిధిలోని జంగాలపల్లి కేజీబీవీని జీసీడీఓ రజిత సందర్శించారు. కలెక్టర్ దివాకర అందించిన విజయపథ సందేశ పత్రాలను విద్యార్థులకు ఎంఈఓ వెంకటేశ్వరరావుతో కలిసి అందజేశారు. పదో తరగతి విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించాలని పలు సూచనలు చేశారు. అనంతరం టీచింగ్ స్టాఫ్ యాక్షన్ ఫ్లాన్ ఉపాధ్యాయుల డైరీలతో పాటు స్టోర్‌రూమ్, కిచెన్‌గార్డెన్, వాష్‌రూమ్‌లను పరిశీలించారు.


