తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి

Mar 12 2026 7:13 AM | Updated on Mar 12 2026 7:13 AM

ములుగురూరల్‌: మున్సిపాలిటీ పరిధి బండారుపల్లిలోని 12, 13 వార్డుల్లో నెలకొన్న తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చింతనిప్పుల చంద్రకళ అన్నారు. ఈ మేరకు బుధవారం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వార్డుల్లో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డ్రెయినేజీలో నీటి నిల్వలు లేకుండా ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ సిబ్బందికి సూచించారు. దోమల కారణంగా ప్రజలు అనారోగ్య సమస్యల భారినపడే ప్రమాదం ఉన్నందున ఫాగింగ్‌ చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ రమేశ్‌, కౌన్సిలర్లు గుంటోజు పావని, పోరిక రాజునాయక్‌, గుగ్గిళ్ల దివ్య, కేశెట్టి నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.

మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ చంద్రకళ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement