ఏటూరునాగారం: హనుమకొండలోని పీఈటీసీ సెంటర్లలో 2025 మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 141 మంది నిరుద్యోగులకు ఫౌండేషన్ కోర్సులు ఇచ్చామని ఐటీడీఏ ఏపీఓ వసంతరావు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం సాక్షిలో ప్రచురితమైన ‘ట్రైనింగ్ నిల్’ అనే కథనానికి ఏపీఓ స్పందించి వివరణతో కూడిన లేఖను అందించారు. ఫౌండేషన్ కోర్సుల కోసం ఏజెన్సీలకు ఇంటర్వ్యూలను నిర్వహించిన తర్వాతనే ‘శ్రీధర్ సీసీఈ’ అనే అకాడమీకి అప్పగించామన్నారు. వైటీసీ కేంద్రాల్లో డీఆర్‌డీఓ, సెర్ప్, ద్వారా శిక్షణను చేపడుతామన్నారు. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించిన స్టడీ మెటీరియల్, ఫ్యాకల్టీ రెమ్యునరేషన్ ఇతర సౌకర్యాలన్నీ కమిషనర్ హైదరాబాద్‌చే అప్రూవల్ అయిన తర్వాతనే ఇవ్వడం జరిగిందన్నారు. పీఈటీసీలో మరో బ్యాచ్‌కు కూడా శిక్షణ ఇచ్చేందుకు తగిన ఏర్పాట్లు చేసినట్లు ఏపీఓ తెలిపారు. ఈ శిక్షణ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బ్యాంకింగ్, రైల్వే, ఎస్‌ఎస్‌సీ, ఇన్సూరెన్స్, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన పోలీసు కానిస్టేబుల్స్, ఎస్సై, జీపీఓ, గ్రూప్స్ నియామకాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు.
ఇంటెలిజెన్స్ ఆరా
వైటీసీలో ట్రైనింగ్ నిల్, పీఈటీసీలో జరుగుతున్న అక్రమాలపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. పీఈటీసీలో ఎలాంటి ట్రైనింగ్ జరిగాయి. ఎంత ఖర్చు చేశారని కూపి లాగుతున్నారు. వైటీసీలకు చెందిన నిధుల మళ్లింపు ఎలా జరిగిందని ఐటీడీఏ అధికారుల నుంచి వివరాలను ఇంటెలిజెన్స్ బృందం సేకరిస్తోంది. ఇందులో ఎవరి పాత్ర ఉన్నా.. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అధికారులు తెలిపారు.
పీఈటీసీతో 141 మందికి లబ్ధి
ఐటీడీఏ ఏపీఓ వసంతరావు


