ములుగు రూరల్: విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని కలెక్టర్ దివాకర అన్నారు. సోమవారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మండల పరిధిలోని ఇంచర్లలోని గిరిజన బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలోని గదులు, స్టోర్ రూమ్, కిచెన్ షెడ్, విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసతి గృహంలోని విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించా లని అధికారులను ఆదేశించారు. అనంతరం మో డల్ బస్టాండ్ పనులను పరిశీలించారు.
కలెక్టర్ దివాకర


