ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి | - | Sakshi
Sakshi News home page

ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలి

Mar 10 2026 1:23 PM | Updated on Mar 10 2026 1:23 PM

ఏటూరునాగారం: కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగులకు కనీస వేతనం చెల్లించాలని టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య అన్నారు. సోమవారం మండలకేంద్రంలోని కస్తూర్భాగాందీ విద్యాలయం, మండల విద్యావనరుల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలతో ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ 29 రోజుల సమ్మె కాలానికి వేతనాలు చెల్లించాలని, హెల్త్‌ కార్డులు మంజూరు చేయాలని, కేజీబీవీ పాఠశాలలో కేర్‌ టేకర్స్‌ను నియమించాలని డిమాండ్‌ చేశారు. మార్చి 16 తేదీన ములుగు జిల్లా కేంద్రంలో జరిగే ధర్నా, 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు పత్రి కిరణ్‌, కోశాధికారి మండపు సంతోష్‌, కేజీబీవీ ఉపాధ్యాయులు అరుణ, స్వరూప, హరిత, రమాదేవి, సమగ్ర శిక్ష ఉద్యోగులు పాల్గొన్నారు.

టీఎస్‌ యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement