వెంకటాపురం(ఎం): ప్రపంచ వారసత్వ సంపద గల రామప్ప దేవాలయానికి నూతన ఈఓగా (ఆలయ కార్యనిర్వహణాధికారి) ఇమ్మడి భాస్కర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హన్మకొండ మండలం వేలేరు మండల పంచాయతీ అధికారిగా పనిచేస్తున్న భాస్కర్‌కు రామప్ప ఆలయ ఈఓగా అదనపు బాధ్యతలు కల్పిస్తూ దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాస్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయన సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ ఈఓగా పనిచేస్తున్న బిల్ల శ్రీనివాస్‌ను జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మండలగిరి వేంకటేశ్వరస్వామి ఆలయానికి అదనపు బాధ్యతలు కేటాయించారు. నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఈఓ భాస్కర్ రామప్ప రామలింగేశ్వరస్వామికి కుటుంబసమేతంగా పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన పూజారి హరీష్‌శర్మ ఈఓ దంపతులను శాలువాతో సత్కరించారు.


