ట్రైనింగ్‌ నిల్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రైనింగ్‌ నిల్‌

Mar 9 2026 7:39 AM | Updated on Mar 9 2026 7:39 AM

ట్రైనింగ్‌ నిల్‌ నామమాత్రంగా గిరిజన దర్బార్‌ వరల్డ్‌ కప్‌ గెలుపుతో సంబురాలు వైటీసీలను తెరిపించాలి

నామమాత్రంగా యువజన శిక్షణ కేంద్రాలు

న్యూస్‌రీల్‌

నిధులు నీళ్లలాగ ఖర్చు

ములుగు
సోమవారం శ్రీ 9 శ్రీ మార్చి శ్రీ 2026
నామమాత్రంగా గిరిజన దర్బార్‌

7

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 5వ వార్డు సభ్యుడు కొండాయి చిన్ని ఆధ్వర్యంలో టీ 20 వరల్డ్‌ కప్‌ క్రికెట్‌ పోటీల్లో భారత్‌ విజయం సాధించడంతో యువకులు ఆదివారం సంబురాలు జరుపుకున్నారు. భారత్‌ జట్టు 20 ఓవర్లకు 255 పరుగులు చేయగా న్యూజిల్యాండ్‌ జట్టు 19 ఓవర్లకు 159 పరుగులు చేసి ఓడిపోయింది. భారత్‌ జట్టు గెలవడంతో బాణసంచా కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. జై భారత్‌ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు.

ఏటూరునాగారం: సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలోని ఐదు యూత్‌ ట్రైనింగ్‌ సెంటర్ల(వైటీసీ)లో యువతకు గతంలో శిక్షణ ఇచ్చేవారు. అయితే ములుగులో ఉన్న వైటీసీని సెంట్రల్‌ యూనివర్సిటీకి, మహబూబాబాద్‌లో ఉన్న వైటీసీ జేఎన్‌టీయూ యూనివర్సిటీకి కేటాయించారు. ఏటూరునాగారం, కాటారం, హనుమకొండ వైటీసీలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కానీ వీటిల్లో ప్రస్తుతం ఎలాంటి శిక్షణలు చేపట్టడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్జెక్టు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో 2022–23లో కోటి రూపాయలు మంజూరు చేశారు. ఈ నిధులతో గిరిజన యువతీయువకులకు హోటల్‌ మేనేజ్‌మెంట్‌, సోలార్‌, కంప్యూటర్‌ కోర్సులో మూడు నెలల శిక్షణతో పాటు భోజన వసతి కల్పించాల్సి ఉంది. కానీ ఆ నిధులను ఫ్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(పీఈటీసీ)కి మళ్లించారు. దీంతో వైటీసీ ట్రైనింగ్‌ సెంటర్లలో యువతకు ట్రైనింగ్‌ ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. సెంటర్లను సైతం అధికారులు మూసివేశారు.

నామమాత్రంగా ఫౌండేషన్‌ కోర్సు

పీఈటీసీలో కొత్తగా ఫౌండేషన్‌ కోర్సును తెరమీదకు తీసుకొచ్చారు. సివిల్స్‌, నీట్‌ వరకు శిక్షణ ఇచ్చేందుకు ఎలాంటి అర్హత లేని అమీర్‌పేటకు చెందిన ఓ ఏజెన్సీని ఫౌండేషన్‌ కోర్సుకు ట్రైనర్స్‌గా కేటాయించారు. గతంలో పనిచేసిన ప్రిన్సిపాల్‌కు ఏజెన్సీ ప్రతినిధికి స్నేహం ఉండడంతో ఆ ఏజెన్సీ శిక్షణ బాధ్యతను అప్పగించడంతో పాటు ప్రత్యేకమైన స్టడీ మెటీరియల్‌ను కూడా తయారు చేయించే అగ్రిమెంట్‌ కూడా ఇచ్చారు. ఒక్కో బుక్కుకు రూ. 800 చెల్లించి పీఈటీసీ సెంటర్‌ ప్రిన్సిపాల్‌ కొనుగోలు చేశారు. అదే మార్కెట్‌లో రూ. 400 చెల్లిస్తే అన్ని రకాలుగా ఉన్న మెటీరియల్‌ లభించేది. కానీ ఏజెన్సీ వారు ఇచ్చే కమిషన్లకు ఆశపడి నిర్వహకులు అర్హత లేనివారితో స్టడీ మెటీరియల్‌, ట్రైనింగ్‌ ఇప్పించడం పలు విమర్శలకు తావిస్తోంది.

ఫలితాల్లో వెనుకంజ

హనుమకొండలోని పీఈటీసీలో ఫలితాలు చూస్తే కేవలం రెండేళ్లలో 30 మందికి కూడా ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు లేవు. అంతేకాకుండా ఈ పీఈటీసీలో ఏజెన్సీ గిరిజనులకు ప్రాముఖ్యత ఇవ్వకుండా కేవలం మైదాన ప్రాంతాల గిరిజనులకే కల్పించి వారికి నచ్చినట్లు రికార్డులు రాసుకొని బిల్లులను డ్రా చేసుకున్నట్లు గిరిజన సంఘాల నాయకుల ఆరోపిస్తున్నారు. అసలు పీఈటీసీకి బడ్జెట్‌ ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత ఖర్చు చేశారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయనే వివరాలను పీఈటీసీ ప్రిన్సిపాల్‌ విడుదల చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని గిరిజన సంఘాల నాయకులు వాపోతున్నారు. ఐటీడీఏలోని అకౌంట్స్‌ అధికారులు సైతం పీఈటీసీకి నిధుల మళ్లింపులో సహకరించి కమీషన్లు తిన్నట్లు సమాచారం ఉందని గిరిజన సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. సమగ్రంగా ఆడిట్‌ చేస్తే అసలు విషయం బయటకు వస్తుందని పలు సంఘాల నాయకులు వాపోతున్నారు.

మూతపడిన వైటీసీ కేంద్రాలను తెరిపించి నిరుద్యోగ గిరిజన యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. మూడేళ్ల నుంచి ఎలాంటి శిక్షణ, ఉపాధి లేక గిరిజన యువకులు రోడ్లపై తిరుగుతున్నారు. వారి ప్రవర్తన, అలవాట్లు చెడు మార్గాలకు వైపునకు వెళ్తున్నాయి. ఐటీడీఏకు కోట్లాది రూపాయల నిధులు వస్తున్నా పక్కదారి పట్టించి అధికారులు వారి స్వార్ధాల కోసం ఇతర అవసరాలకు ఖర్చు చేస్తున్నారు. నిరుద్యోగులకు వెంటనే ట్రైనింగ్‌ ఇవ్వడం ప్రారంభించాలి. పీఈటీసీకి వచ్చిన నిధులు, ఖర్చులపై బహిరంగంగా వివరణ ఇవ్వాలి.

– నీలాద్రి, శంకరాజుపల్లి,

తుడుందెబ్బ నాయకుడు

నిరుద్యోగులకు అందని ఉపాధి

రెండు వైటీసీలు యూనివర్సిటీలకు కేటాయింపు

నిధుల దారి మళ్లింపు..

పట్టించుకోని అధికారులు

వైటీసీల్లో యువతకు ట్రైనింగ్‌ ఇచ్చేందుకు 2022–23లో మంజూరైన కోటి రూపాయల నిధులను హనుమకొండలోని ఫ్రీ ఎగ్జామినేషన్‌ ట్రైనింగ్‌ సెంటర్‌(పీఈటీసీ)కి నిధులను బదలాయించారు. నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ పీఈటీసీ ప్రిన్సిపాల్‌ పలుకుబడితో లోపాయికారంగా ఈ నిధులను మళ్లించుకున్నాడు. అదే విధంగా ఎగ్జామ్‌కు ప్రిపరేషన్‌ అయిన విద్యార్థులనే తీసుకొచ్చి నామమాత్రంగా శిక్షణ ఇచ్చి నట్లు రికార్డులు సృష్టించారు. ఇష్టానుసారంగా విద్యార్థుల పేర్లను నమోదు చేసుకొని వారికి ఉద్యోగాలు వచ్చినట్లు రికార్డులు నమోదు చేసి ఆ నిధులను నీళ్లలాగ ఖర్చు చేశారు.

సమస్యల పరిష్కారం గాలికే...

గైర్హాజరవుతున్న అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement