● జిల్లా సంక్షేమ అధికారి ప్రేమత
వెంకటాపురం(కె): మహిళలు అన్నిరంగాల్లో రాణించాలని జిల్లా సంక్షేమ అధికారి ప్రేమలత అన్నారు. మండల కేంద్రంలోని కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆనంతరం కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. బాల్య వివాహాలను నిర్మూలిస్తే మహిళల హక్కులను కాపడినట్లేనని తెలిపారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించి దేశాభివృద్ధిలో కీలక పాత్రపోషించాలని సూచించారు. మహిళల హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని వివరించారు. అనంతరం వెంకటాపురం, వాజేడు మండలాలకు చెందిన మహిళా సర్పంచ్‌లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ సర్పంచ్ తాటి సరస్వతి, కాఫెడ్ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్ లూర్ధు రాజు, సీడీపీవో ముత్తమ్మ, సూపర్‌వైజర్ పుష్పలత, శ్యామల, సుధాకర్. లారెన్స్, గొంది హనుమంతు పాల్గొన్నారు.


