ములుగు: రాష్ట్రంలో పౌరసేవలను పారదర్శకంగా వేగంగా అందించేందుకు ప్రభుత్వం నూతన విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిందని ములుగు ఆర్డీఓ వెంకటేశ్ తెలిపారు. కలెక్టరేట్‌లో రెవెన్యూ శాఖ అఽధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన గురువారం మాట్లాడారు. ఇకపై పౌరసేవల దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, రెవెన్యూ సిబ్బంది నివేదికల సమర్పణ తదితర ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్ విధానంలోనే కొనసాగుతుందన్నారు. కాగిత రహిత విధానం అమల్లోకి రావడంతో సమయానికి సేవలు అందడం, పారదర్శకత పెరగడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం ఆదాయ ధ్రువీకరణ పత్రం సేవలు అందుబాటులోకి వచ్చాయని వెల్లడించారు. దశలవారీగా కులం, నివాసం వంటి ఇతర ధ్రువపత్రాలు సేవలను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ఆనంతరం ఈ మొబైల్ యాప్ వినియోగంపైన కలెక్టరేట్ కార్యాలయంలో ఈ–డిస్ట్రిక్ట్ మేనేజర్ దేవేందర్ శిక్షణ ఇచ్చారు. మీసేవ ద్వారా అప్లై చేస్తే దరఖాస్తు తొలుత జీపీవో లాగిలోకి వస్తుందన్నారు. అనంతరం మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఎంఆర్‌ఐ)కి, తదనంతరం ఆర్‌ఐ నుంచి నేరుగా డిప్యూటీ తహసీల్దార్(డీటీ) లాగిన్ కి చేరుతుందని వివరించారు. ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు జిల్లా, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ చేస్తుంటారని వివరించారు.
ములుగు ఆర్డీఓ వెంకటేశ్


