విద్యుత్‌ సరఫరాలో లైన్‌మెన్ల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరాలో లైన్‌మెన్ల పాత్ర కీలకం

Mar 5 2026 7:27 AM | Updated on Mar 5 2026 7:27 AM

గోవిందరావుపేట: విద్యుత్‌ సరఫరాలో లైన్‌మెన్ల పాత్ర కీలకమైందని డీఈ నాగేశ్వరరావు, ఏడీఈ వేణుగోపాల్‌, ఏఈ దేవ్‌సింగ్‌, సబ్‌ ఇంజినీర్‌ అఖిల అన్నారు. పస్రా సెక్షన్‌లో లైన్‌మెన్‌ దివాస్‌ కార్యక్రమాన్ని పురస్కరించుకుని విద్యుత్‌ శాఖ ఆధ్వర్యంలో ఓ అండ్‌ ఎం(ఆపరేటర్‌ అండ్‌ మెంటెనెన్స్‌) సిబ్బందిని బుధవారం శాలువాలతో సన్మానించి సర్టిఫికెట్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాలు, గాలులు, ప్రమాదకర పరిస్థితులు ఎదురై విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు వాటిని సరిచేసి లైన్‌మెన్‌లు నిరంతర విద్యుత్‌ను అందిస్తున్నారని తెలిపారు. వారి సేవలు అభినందనీయమని వివరించారు. ఈ కార్యక్రమంలో లైన్‌ ఇన్‌స్పెక్టర్లు రామచంద్రయ్య, సమ్మిరెడ్డి, లైన్‌మెన్లు తిరుపతి, వేణు, అసిస్టెంట్‌ లైన్‌మెన్లు భిక్షపతి, రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement