వాజేడు: రక్తదానం ప్రాణదానంతో సమానమని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు. మండల పరిధిలోని ప్రగళ్లపల్లిలో సోమవారం చేయూత స్వచ్ఛంద సంస్థ, మదర్ థెరిసా చారిటబుల్ ట్రస్టు, దూలాపురం అటవీ రేంజ్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం చేసి మరొకరి ప్రాణాలను కాపాడటం అనేది మాటలకు అందనిదని తెలిపారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతిఒక్కరూ రక్తాన్ని దానం చేయాలని సూచించారు. రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన 25 యూనిట్ల రక్తాన్ని రెడ్‌క్రాస్ సొసైటీ వారికి అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మడకం సుభద్ర, మాజీ సర్పంచ్ నరే శ్, దూలాపురం రేంజర్ బాలకృష్ణ, మురళి, లలిత, ఆదిలక్ష్మి, జగదీశ్, గాంధీ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ నాగజ్యోతి


