ములుగు రూరల్: కొత్తూరు దేవునిగుట్టపై కొలువైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు సోమవారం లక్ష్మీనర్సింహస్వామి జాతరలో భాగంగా స్వామి కల్యాణ మహోత్సవంలో ఎడ్లబండ్లు తిరుగు కార్యకక్రమం నిర్వహించారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశారు. మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.


