ములుగు రూరల్: మహిళలు సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో రాణించినప్పుడే వికసిత్ భారత్ సాధ్యమవుతుందని తెలంగాణ అకాడమీ అఫ్ సైన్స్ రీజినల్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ కిషన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సోమవారం సైన్స్ డే సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలం వరకు శాస్త్ర సాంకేతిక రంగాల్లో అనేక విజయాలు సాధించామన్నారు. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిఒక్కరూ శాసీ్త్రయ దృక్పథాన్ని అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ములుగు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, ఎకో క్లబ్ కన్వీనర్ సరిత, అధ్యక్షులు బాలయ్య, సరిత, అనిల్ కుమార్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


