ప్రజావాణి దరఖాస్తుల వివరాలు
ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో అధికారులకు బాధితుల వేడుకోలు
ములుగు రూరల్/ఏటూరునాగారం: జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి, గిరిజన దర్బార్‌లో సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాధితులు అధికారులకు అర్జీలను సమర్పించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో 59 వినతులు రాగా కలెక్టర్ దివాకర స్వీకరించారు. అలాగే ఐటీడీఏలో నిర్వహించిన గిరిజన దర్బార్‌లో 10 వినతులు రాగా ఐటీడీఏ డిప్యూటీ డీడీ దబ్బగట్ల జనార్ధన్ స్వీకరించారు. వాటిని పరిశీలించిన అధికారులు తక్షణమే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.
భూ సమస్యలు 14
పింఛన్లు 14
ఇందిరమ్మ ఇళ్లు 14
ఇతర శాఖలకు
సంబంధించి 17
ప్రజావాణిలో 59, గిరిజన దర్బార్‌లో 10 అర్జీలు
స్వీకరించిన కలెక్టర్ దివాకర, ఐటీడీఏ డిప్యూటీ డీడీ జనార్దన్


