ఎస్‌ఎస్‌తాడ్వాయి మండలం గోనెపల్లికి చెందిన రైతు రైతు భరోసా వచ్చేలా చూడాలని విన్నవించారు. అలాగే కొండపర్తికి చెందిన అభయహస్తం ఫౌండేషన్ ద్వారా ఆదివాసీ గిరిజన పిల్లల కోసం నిర్మించిన లెర్నింగ్ సెంటర్ ప్రారంభించామని, ఐటీడీఏ ద్వారా మరింత సహకారం అందించాలని కోరారు. కాటాపురం సమీపంలోని శ్రీరామ్‌నగర్‌లో లెర్నింగ్ సెంటర్ నిర్మాణం, అవసరమైన సామగ్రి అందించాలని కోరారు. సంగెం మండలం పోచమ్మతండాకు చెందిన ఒకే కుటుంబానికి కుమారుడికి ఎంబీబీఎస్, కుమార్తెకు ఐఐటీ సీటు వచ్చిందని, ఆర్థిక సాయం అందించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం లో ఐటీడీఏ గెస్ట్‌హౌజ్‌లో కాంటిజెంట్ వర్కర్‌గా పనిచేస్తున్న ఉద్యోగి రెగ్యులర్ చేయాలని డీడీకి విన్నవించారు. మంగపేట మండలం రమణక్కపేటకు చెందిన ఓ గిరిజన విద్యార్థిని జీఎన్‌ఎంగా కోర్సు చేసి ఎంజీఎంలో స్టాఫ్‌నర్సుగా ట్రైనింగ్ పూర్తి చేసి ఖాళీగా ఉంటున్నానని ఉద్యోగ అవకాశం కల్పించాలని విన్నవించారు. పాలకుర్తి మండల కేంద్రానికి చెందిన ఓ నిరుద్యోగి ఉద్యోగ అవకాశం కల్పించాలని కోరారు. వెంకటాపురం(కె) ఆలుబాకకు చెందిన ఓ గిరిజనుడు, వాజేడుకు మండలం పూసూరుకు చెందిన గిరిజనులు ఇందిర సౌర గిరివికాసం కింద బోరు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఓ సురేష్‌బాబు, మేనేజర్ శ్రీనివాస్, జేడీఎం కొండల్‌రావు, ప్రోగ్రాం అధికారి మహేందర్, పెసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, ఐటీఐ ప్రిన్సిపాల్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్నారు.


